తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : చండ్రుగొండ మండల కేంద్రంలో రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సమాజానికి ఎంతో పవిత్రమైనదని ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేస్తూ సహాయ సహకారాల భావనను పెంపొందించే గొప్ప పండుగ అని అన్నారు పేద మరియు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు కూడా ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రంజాన్ తోఫాను అందజేస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మతభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్ర రావు, ముస్లిం మత పెద్దలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ