Thursday, 17 September 2026 03:55:51 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 08 July 2026 06:10 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి కేంద్రంలో కచ్చితంగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.బుధవారం బూర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో మీసేవ కేంద్రాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో పాటు తహసీల్దార్ ప్రసాద్ , మండలంలోని గ్రామ పంచాయతీ అధికారులు (జీపీఓలు), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు), మీసేవ కేంద్రాల వీఎల్‌ఈలు, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు , జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం మండలంలో కూడా ఇదే అంశాలపై తహసీల్దార్, జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ కేంద్రాల వీఎల్‌ఈలు, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా మేనేజర్ కృష్ణమూర్తితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మీసేవ కేంద్రాలు నిర్ణయించిన పని వేళలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దరఖాస్తుదారుల నుంచి అవసరం లేని భౌతిక పత్రాలను మండల రెవెన్యూ కార్యాలయాలు కోరకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రసీదుల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కాగితపు రసీదులకు బదులుగా దరఖాస్తుదారుల మొబైల్‌కు రసీదు సందేశం పంపించి, అవసరమైతే ఈ-ప్రింట్ సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన సేవా రుసుములకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు మొత్తాలు వసూలు చేయరాదని హెచ్చరించారు. దరఖాస్తులకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను మాత్రమే అప్లోడ్ చేయాలని, ప్రతి పత్రాన్ని స్పష్టంగా స్కాన్ చేసి నాణ్యతతో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి మీసేవ కేంద్రంలో రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.ప్రజలు ప్రభుత్వ సేవల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తారని, వారితో మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకత, బాధ్యతతో సేవలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ సమావేశాల్లో తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మీసేవ కేంద్రాల వీఎల్‌ఈలు, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు , జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :