Wednesday, 16 September 2026 05:23:57 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జేబీపీ పోరాటంతో డీపీఆర్ టెండర్ రద్దు.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 13 August 2026 05:22 PM Views : 166

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జేబీపీ పోరాటంతో డీపీఆర్ టెండర్ రద్దు.టెండర్ రద్దుతో చేతులు దులుపుకోవడం కాదు..అవినీతి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.ప్రజా పోరాటాలకు ఎవరైనా తలవంచాల్సిందే.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. కొత్తగూడెం కార్పొరేషన్‌లో అవినీతి,అక్రమాలకు వ్యతిరేకంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న నిరంతర ప్రజా పోరాటానికి మరోసారి విజయం లభించిందని ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.జైభీమ్ రావ్ భారత్ పార్టీ పోరాటం నేపథ్యంలో డీపీఆర్ టెండర్‌ను రద్దు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.పాల్వంచ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో యెర్రా కామేష్ మాట్లాడుతూ..ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా,పారదర్శకతకు తావులేకుండా వ్యవహరిస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలపై న్యాయబద్ధంగా,నిరంతరం పోరాటం చేస్తే చివరకు అధికార యంత్రాంగం కూడా ప్రజల డిమాండ్లకు తలవంచాల్సిందేనని అన్నారు.“డీపీఆర్ టెండర్ రద్దు చేయడంతో సమస్య పూర్తయినట్లు అధికారులు భావించకూడదని",టెండర్ ప్రక్రియలో అవినీతి,అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేవలం "టెండర్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం ప్రజలను మోసం చేయడమే” అని యెర్రా కామేష్ వ్యాఖ్యానించారు.కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే ఏ ప్రయత్నాన్నైనా జైభీమ్ రావ్ భారత్ పార్టీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు.టెండర్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని,నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని,ఇప్పటికే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్,తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ కు పిర్యాదు చేయడం జరిగిందన్నారు.ప్రజా సమస్యలపై జేబీపీ పోరాటం ఇక్కడితో ఆగదని యెర్రా కామేష్ తెలిపారు.కొత్తగూడెం కార్పొరేషన్‌లో అవినీతి,అక్రమాలు,ప్రజా నిధుల దుర్వినియోగంపై పార్టీ నిరంతరం నిఘా ఉంచుతుందని అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని యెర్రా కామేష్ స్పష్టం చేశారు,డీపీఆర్ టెండర్ రద్దు ప్రజా పోరాటానికి వచ్చిన ప్రాథమిక విజయమేనని,అయితే అసలు బాధ్యులపై చర్యలు తీసుకున్నప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు.ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పాల్వంచ,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు నిట్టా నర్సింహ,శంకర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :