Tuesday, 03 November 2026 02:51:07 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

రూ.2.50 కోట్ల.. 499 కిలోల గంజాయి పట్టివేత

Date : 13 October 2025 02:57 PM Views : 1549

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం నుండి రాజస్థాన్ జైపూర్‌కి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 499 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయి, మార్కెట్‌ విలువ రూ.2.5 కోట్లుగా అంచనా. CCS పోలీసులు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి గారితో కలిసి వేపలగడ్డ గ్రామంలోని అన్నపూర్ణ బేకరీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో KA38A6754 నంబరు గల అశోక్ లేలాండ్ కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 96 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు జగదీశ్ దయారాం పాటిల్ (మహారాష్ట్ర) మరియు సంజు కుమార్ @ సంజీవ్ (కర్ణాటక) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గంజాయి రవాణాలో పాలుపంచుకున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు ఓడిశా రాష్ట్రానికి చెందిన హరి వద్ద గంజాయి కొనుగోలు చేసి, రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్ కూడా కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయి రవాణా కోసం లారీ డ్రైవర్ సంజు కుమార్ రూ.4.5 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.1.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.స్వాధీనం చేసిన వస్తువుల్లో —96 గంజాయి ప్యాకెట్లు (మొత్తం 499 కిలోలు)రూ. 2.5 కోట్లు విలువఒక కంటైనర్ లారీ (KA38A6754)రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.ఈ ఆపరేషన్‌లో CCS CI రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సుజాతనగర్ SI రమాదేవి మరియు వారి బృందాలు కీలక పాత్ర పోషించాయి. కేసు విచారణాధికారి సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. కొత్తగూడెం డీఎస్పీ, ఎస్‌పీ ఈ బృందాన్ని ప్రశంసించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :