తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమాజంలో దుష్ట శక్తులను రూపుమాపాలి.విజయదశమి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి.శాంతి, సామరస్యాలతో ముందుకు సాగుదాం.ఐక్యతతోనే ప్రగతి సాధ్యమవుతుంది.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసర పండుగ. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం పట్టణ పరిధిలోని రైటర్ బస్తీతో పాటు రామవరంలోని అంబేద్కర్ చమన్ వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక జమ్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రావణాసురుడి దిష్టిబొమ్మ దహన (రావణ వధ) ఘట్టాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బాణసంచా వెలుగుల నడుమ రావణ వధను వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, అన్యాయాలు, చెడు ఆలోచనలను అంతమొందించి ధర్మమార్గాన్ని అనుసరించడమే దసరా పండుగ ఇచ్చే అసలైన సందేశమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలంతా కలసికట్టుగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు వంగ వెంకట్, రమణమూర్తి, జె గట్టయ్య, కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, మునిగడప పద్మ, ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ