తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ, కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్, డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ