Wednesday, 16 September 2026 06:05:46 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌ను రూ. 25.41 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి

Date : 09 April 2025 05:43 PM Views : 811

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపట్టడం ద్వారా గొప్ప పరివర్తన దిశగా పురోగమిస్తుంది. " అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్దిచేయబడుతున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2023 మరియు ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది.

ఈ స్టేషన్ ప్రముఖంగా భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా ఉంటూ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ స్టేషన్ భద్రాచలం ఆలయ పట్టణానికి సమీపంలో ఉండటం వలన భక్తులు మరియు ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ స్టేషన్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా విద్యుదీకరణ మరియు భద్రాచలం రోడ్ - సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఈ కొత్త రైల్వే లైన్ ను దక్షిణ మధ్య రైల్వే మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తద్వారా బొగ్గు రవాణాను సులభతరం చేయడం మరియు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సుమారు రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్, లిఫ్ట్ మరియు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలతో సహా ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో మరింత పునరాభివృద్ధి చేయబడుతూ ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్‌గా నిలువనుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :