Wednesday, 16 September 2026 08:17:14 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది : జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

Date : 20 December 2025 05:13 PM Views : 257

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కేవలం న్యాయస్థానాలకు,న్యాయవాదులకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క పౌరునిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ స్పష్టం చేశారు.సమసమాజ స్థాపన,సమానత్వం,సామాజిక న్యాయం అనే లక్ష్యాలతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఐ.ఎల్.పీ.ఏ జాతీయ అధ్యక్షురాలు కె.సుజాత చౌదంతి అధ్యక్షతన నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర ఐదవ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాకుండా,దేశ ప్రజల జీవన విధానాన్ని దిశానిర్దేశం చేసే మహత్తర గ్రంథమని అన్నారు.సమాన హక్కులు,మానవగౌరవం,స్వేచ్ఛ,సోదరభావం వంటి విలువలను ప్రజలందరికీ అందించాలనే సంకల్పంతో రాజ్యాంగం రచించబడిందని వివరించారు.రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు,దిశానిర్దేశక సూత్రాలు సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పునాదులుగా నిలుస్తున్నాయని,వాటిని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థతో పాటు సమాజంలోని ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.ముఖ్యంగా న్యాయవాదులు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.నేటి కాలంలో రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని,ఈ దిశగా ఇటువంటి రాష్ట్ర స్థాయి మహాసభలు న్యాయవాదుల మధ్య చర్చకు,ఆలోచనలకు,మార్గదర్శకత్వానికి దోహదపడతాయని జిల్లా జడ్జి తెలిపారు.న్యాయవృత్తిలో నైతిక విలువలు,సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు ఈ తరహా సదస్సులు ఉపయోగపడతాయని అన్నారు.ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రాజ్యాంగం,న్యాయస్థానాల విధులు,చట్టాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని,భవిష్యత్తులో న్యాయవాదులు గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని సూచించారు.అలా చేసినప్పుడే నిజమైన న్యాయసమాజం ఆవిర్భవిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన ఐ.ఎల్.పీ.ఏ తెలంగాణ యూనిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ,న్యాయవాదుల హక్కులు,సమస్యలు,భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో కూడా ఐ.ఎల్.పీ.ఏ మరిన్ని సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టి న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత,న్యాయమూర్తులు కిరణ్ కుమార్ కవిత,రాజేందర్,సుచరిత,రవికుమార్,వినయ్ కుమార్,సూరెడ్డి,లక్కినేని సత్యనారాయణ ఐ.ఎల్.పీ.ఏ తెలంగాణ బాధ్యులు శాంసన్,దేవరాజ్ గౌడ్,లక్ష్మీదేవి,సైనీ నాగేందర్,అదనం కామర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :