Friday, 18 September 2026 01:06:02 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సైబర్ నేరాలపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 17 July 2026 04:58 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ముందుగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పుష్పగుచ్ఛం అందించి జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది నుంచి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల షెడ్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌డేట్ చేయాలని, సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్–100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీతో పాటు అధికారులు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :