Sunday, 02 August 2026 03:52:54 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సుజాతనగర్ మండలంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

Date : 23 May 2026 06:26 PM Views : 75

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్రిడ్జి నిర్మాణం సీతంపేట-రాఘవాపురం గ్రామీణుల చిరకాల వాంఛ రూ.4.75కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం రూ.34లక్షలతో రెడ్డిపాలెం సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం రూ.45లక్షలతో నిర్మించిన ఎంఆర్సి భవనం అందుబాటులోకి వచ్చింది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల చెంతనే ఉంటాం రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో పల్లెల రూపురేఖలు మారుస్తాం: కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సుజాతనగర్ మండలంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సీతంపేట-రాఘవాపురం గ్రామీణుల చిరకాల వాంఛ అయిన బ్రిడ్జి నిర్మాణాన్ని నెరవేరుస్తున్నామని, బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించడం జరిగిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సుజాతనగర్ మండల పరిధిలో రూ.5.54 కోట్ల నిధులకు సంబంధించి శనివారం అయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ రూ.4.75 కోట్ల భారీ అంచనా వ్యయంతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.34 లక్షలతో రెడ్డిపాలెం సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రూ.45 లక్షలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎంఆర్సి భవనాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందని, మండలంలో విద్యాసంబంధిత సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయన్నారు. వేపలగడ్డ స్మశానవాటికలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రెండు బోర్లు మంజూరు చేయడం జరిగిందని, వాటి శంకుస్థాపన పూర్తేచేశామన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, తహసీల్దార్ వి వరప్రసాద్, ఎంపిడివో భారతి, ఆరడబ్ల్యూఎస్ ఏఈ గుప్తా, విద్యుత్ ఏఈ జి కిషన్, ఏడిఈ రవికుమార్, సిఐ వెంకటేశ్వర్, పిఆర్ ఏఈ రాజు, డిఈ నాగేందర్, ఎంఈ ఓ లీలా, ఎస్ఐ రమాదేవి, హన్మంతరావు, వ్యవసాయశాఖ అధికారి నర్మద, స్థానిక నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, ఉపేందర్, భూక్యా శ్రీనివాస్, గుమ్మడిల్లి దర్గయ్య, బొడ్డు కేశవరావు, గారికే ఉపేందర్, నరేష్, ముక్కెర మురళి, దండు సురేష్, లావుడియా గోపి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :