Thursday, 14 May 2026 02:20:54 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రజలు పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి, నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 23 August 2025 07:09 PM Views : 412

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతీ కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.రాబోయే గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని సూచించారు.గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నియమ నిబంధనలను గురించి వివరించి వాటిని పాటించేలా చేయాలని తెలిపారు.శోభాయాత్ర సమయాలలో డీజేలు పెట్టడం,టపాసులు కాల్చడం వంటివి నిషేధమని గణేష్ ఉత్సవ్ కమిటీ వారికి తెలియజేయాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర సమయంలో పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను చేయాలని తెలిపారు.అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు.ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి మరియు జిల్లాలోని సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :