తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమ రథసారథి డాక్టర్ వైయస్సార్. డిసిసి అధ్యక్షులు తోట దేవి ప్రసన్న.ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.దేశంలోనే సంక్షేమ పాలనను అన్ని వర్గాల ప్రజలకు అందించి కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా కొలువైన నేత అమరజీవి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని డిసిసి అధ్యక్షులు శ్రీమతి తోట దేవి ప్రసన్న కొనియాడారు.కొత్తగూడెం సూర్యా ప్యాలెస్ సెంటర్లో ఉన్న డాక్టర్ వైయస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి తోటా దేవి ప్రసన్న జిల్లా మండల, పట్టణ కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున జోహార్లు అర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు,విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కేజీ బియ్యం పెన్షన్స్ తదితర సంక్షేమ పథకాలను పేదలకు అందించి కోట్లాదిమంది ప్రజల గుండెల్లో నేటికీ చెరగని ముద్ర వేసిన మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వైస్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.పెద్దబాబు, జిల్లా కోశాధికారి కొరుమూరు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంద హనుమంతు, జానీ పాషా, పూనెం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరమేష్ యాదవ్, కార్పొరేటర్లు కేకే శ్రీనివాస్, దావూద్, దంతే పోయిన నరేష్, జల్లి శ్రీలక్ష్మి, భవిత, విజయలక్ష్మి, ఆటో యూనియన్ నాయకులు కాంగ్రెస్ నాయకులు పూనెం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అనిల్, బాల ప్రసాద్ పాసి, సూరిబాబు, మండల శ్రీనివాస్, అక్బర్, పోస్ట్ ఆఫీస్ వాసు, సమ్మయ్య, వీరయ్య, మధు, రమేష్ బోయినపల్లి రాము, ఉబ్బన రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ