Monday, 02 November 2026 09:05:56 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 19 October 2026 08:18 PM Views : 84

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టన్నెల్‌తో పాటు పాలేరు లింక్‌ కాలువ పనులు సమాంతరంగా పూర్తి చేయాలి.కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలి.ప్రతి నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామ పరిధిలోని భోజ్య తండా అటవీ ప్రాంతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పథకంలో ప్యాకేజీ నంబర్‌ 8 కింద నిర్మిస్తున్న జూలూరుపాడు టన్నెల్‌ పనులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్‌ నిర్మాణం, పాలేరు లింక్‌ కాలువ పనులు, ప్రాజెక్టు అనుసంధానంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ , సీతారామ ప్రాజెక్టులో కీలకమైన జూలూరుపాడు టన్నెల్‌ పనులను వేగవంతం చేసి వచ్చే విజయదశమి నాటికి పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. టన్నెల్‌ పనులతో పాటు పాలేరు లింక్‌ కాలువ నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టి, టన్నెల్‌ పూర్తయ్యేలోగా కాలువ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఇంజినీరింగ్‌ అధికారులు, నిర్మాణ సంస్థ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.గతంలో భారీ మట్టి కట్టల నిర్మాణంపై నిపుణుల కమిటీ సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేయడం తో , టన్నెల్‌ నిర్మాణంపై సమగ్ర సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు టన్నెల్‌ నిర్మాణం సురక్షితమైనదిగా, పనులను వేగంగా పూర్తి చేసేందుకు అనుకూలమైనదిగా నిర్ధారించినట్లు తెలిపారు. టన్నెల్‌ నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ముఖ్యమంత్రి 4 వేల కోట్లు ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో కాలువల నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో రైతులను ఒప్పించి పనులు ముందుకు సాగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని, భూముల సర్వే ఆధారంగా అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.గోదావరి జలాలను వినియోగించుకుని జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సింగభూపాలెం, అన్నదైవం, వెంగళరాయసాగర్, వైరా, లంకాసాగర్ తదితర ప్రాజెక్టులకు నీటిని అందించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మారెళ్ళ పాడు లిఫ్ట్‌ ద్వారా పినపాక ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. జూలూరుపాడు టన్నెల్‌ పూర్తయితే పాలేరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా సాగునీటి సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా నీరు, విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం జూలూరుపాడు–వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కాలువలో నీటి ప్రవాహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు గోదావరి జలాల వినియోగం కీలకమని మంత్రి అన్నారు . జూలూరుపాడు టన్నెల్‌, అనుసంధాన కాలువల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :