Friday, 18 September 2026 09:44:41 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జిల్లాలో 1,50,000 ఎకరాలలో మునగ సాగు చేసేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 October 2024 06:31 PM Views : 655

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా లోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,మహిళా శక్తి యూనిట్లు,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు పీఎం విశ్వకర్మ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ నర్సరీల లో ఏదో ఒక మొక్కలు కాకుండా వాతావరణానికి మరియు ఆయుర్వేదంగా అనుకూలమైన మొక్కలు దొరంతో , డెకోమో, యూజీనియా , పండానాజ్ , సుబాబులు, వేప, రావి మరియు గానుగ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని కెనాల్ ల రెండు వైపులా జామాయిల్, బాంబు, సుబాబుల్ మరియు యూకలిప్టక్స్ మొక్కలు నాటాలనిఅన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో ప్రభుత్వ ఆఫీసుల్లో, మరియు కాళీ ప్రదేశాల్లో మునగ, ఉసిరి, పనస, మారేడు, మేడి మరియు అల్లనేరేడు మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలు ప్రభుత్వ ఆఫీసులు పంచాయతీ ప్రదేశాలు బట్టి ఎన్ని మొక్కలు పడతాయో అంచనా వేసుకోవాలని దాని ప్రకారం మొక్కల పెంపకం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 1,63 వేల ఎకరాల్లో వరి సాగు, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు, రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, రైతులకు వీటి సాగుతో పాటు అంతర్ పంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ ఫామ్ మరియు అంతర్ పంటలుగా మోరింగా సాగు, మునగ సాగు,చేపల పెంపకం, బోర్ ఉన్న పంట పొలాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆ విధంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఫామ్ పౌండ్, సాగుకు అవసరమైన గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో సాగును చేపట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మునగ సాగు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, అజోల్ల పెంపకం, నాటు కోళ్ల పెంపకం మరియు బాతుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని, దానికి తగిన అవగాహన కల్పించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :