తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి జిల్లాలో రేగా కాంతారావుకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జూలూరుపాడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా రాంమూర్తి మాట్లాడుతూ. ఒక ఆదివాసి బిడ్డ ఉపాధ్యాయ స్థాయి నుంచి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఎదగడాన్ని చూసి జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదురుకోలేక తప్పుడు కేసులతో వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయస్థానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయంగా పోరాడి ఈ అసత్య ప్రచారాలను తిప్పికొడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్య ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మీద కుట్రలు చేస్తూ వారి రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకోవాలి అని చూస్తున్న అధికార పార్టీ నాయకులకు ఏదో ఓక రోజు గుణపాఠం తప్పదు. అధికారం ఎప్పటికి ఎవ్వరికీ శాశ్వతం కాదు. ప్రతి ఆడబిడ్డను తన సోదరిగా భావించి వారి కష్టానికి నేను అండగా ఉంటాను అని చెప్పే రేగా అన్న మీద చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు. రేగాని ఎంత అనగతొక్కాలి అని చుస్తే అంత ప్రజాధరణతో పైకి వస్తాడు. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న వాళ్ళని అదేవిధంగా చేపించిన వాళ్లని త్వరలోనే బయటికి లాగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ