Friday, 18 September 2026 06:13:47 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 30 May 2026 07:45 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 5 నుండి 12, 2026 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం ఐ డి ఓ సి కార్యాలయం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 5వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,399 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, వారి కోసం నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్షల నిర్వహణ కోసం నాలుగు మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నాలుగు మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు .విద్యార్థులు పరీక్షలకు ముందురోజే తమ పరీక్షా కేంద్రాలను తెలుసుకోవాలని , పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణలో విద్యుత్ సరఫరా, రవాణా, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి, వైద్యశాఖ ప్రతినిధి డా. టి. ప్రతాప్, విద్యుత్ శాఖ డీఈ పి.ఎస్.వి.ఎస్. నందయ్య, ఇల్లందు మున్సిపాలిటీ ప్రతినిధి డి. శ్రీనివాస్, ఆర్టీసీ ప్రతినిధి కె. మోహన్‌రావు, డీపీఓ కార్యాలయ ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, పోస్టల్ శాఖ ప్రతినిధి ఎం.డి. అలీం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి ఎం. అశోక్, పోలీసు శాఖ ప్రతినిధి పి.డి. క్రిస్టఫర్, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షలు) ఎస్. మాధవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :