Wednesday, 16 September 2026 09:54:23 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భద్రాచలంలో రూ 1.50 కోట్ల వ్యయంతో డార్మెంటరీ నిర్మాణాలకు భూమి పూజ : భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 06 September 2026 04:57 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి పుష్కరాల భక్తుల కోసం డార్మెంటరీ నిర్మాణం. భద్రాచలంలో రూ 1.50 కోట్ల వ్యయంతో డార్మెంటరీ నిర్మాణాలకు భూమి పూజ : భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం డార్మెంటరీ హాల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.గోదావరి పుష్కరాల కోసం భద్రాద్రి జిల్లాలోని దక్షిణ అయోధ్యగా పేరు ప్రఖ్యాతలు గడిచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంకు విచ్చేసి భక్తుల కొరకు ఈ డార్మెటరీ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగాభద్రాచలంలోని అమ్మ సత్రం ప్రాంతం వద్ద దేవాదాయ - ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ 1.50 కోట్ల వ్యయంతో "డార్మెంటరీ జి ప్లస్ వన్ భవన్ " నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించగా ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడారు.గోదావరి పరివాహక ప్రాంతాలలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భక్తులు హాజరవుతారని, ముఖ్యంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. భక్తులకు కనీస వసతులను కల్పించే ఉద్దేశం లో భాగంగా వారి వసతి కొరకు దేవాదాయ శాఖ తరపున ఈ డార్మెటరీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పది రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశం ఈ పుష్కర పనులపై నిర్వహిస్తామని అధికారులు ఇది గమనించి పనిచేయాలని తెలిపారు. ఘాట్ నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ అధికారులు, త్రాగునీటి సరఫరా ను ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులు, రోడ్డు పనులను ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్వహించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రారంభించిన ఘాట్ నిర్మాణాలతో పాటు డార్మెంటరీ నిర్మాణాలను సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఏడు జిల్లాలో గోదావరి పుష్కర పనులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా భద్రాచలంలో జరుగుతున్న పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా సకాలంలో పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఈ.ఓ దామోదర్, సర్పంచ్ పూనం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత,వార్డు సభ్యులు రమణ,కారం దుర్గారావు,వాణి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :