Thursday, 17 September 2026 09:48:01 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 27 April 2026 05:11 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్, కొత్తగూడెం ఆర్డీవోతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులో పరిష్కారం అందించేలా చర్యలు పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: 1. దుమ్ముగూడెం మండలం చిన్న కమలాపురం గ్రామానికి చెందిన పూనెం ముత్తయ్య తన తండ్రి పేరుమీద ఉన్న పట్టాదారు భూమిలో 5.48 సెంట్లు తన పేరుమీదకు మార్పిడి చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. చలాన్ కట్టినప్పటికీ పట్టా మంజూరు కాలేదని చేసిన దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం సంబంధిత సి సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు. 2. పాల్వంచ 44వ డివిజన్ గాంధీనగర్‌కు చెందిన వీరమల్ల దుర్గారాణి ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తాను డిగ్రీ (B.A), ఐటీఐ పూర్తి చేసిన నేపథ్యంలో ఉపాధి కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. 3. పాల్వంచ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన కృష్ణ తన ఆధీనంలో ఉన్న 8 ఎకరాల భూమిలో 2016లో 6 ఎకరాలు, ఇటీవల మిగిలిన 2 ఎకరాలు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, జీవనాధారం కోల్పోయానని వాపోయారు. తనకు భూమి తిరిగి ఇవ్వాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి పాల్వంచ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO)కు ఎండార్స్ చేశారు. 4. భద్రాచలం పట్టణానికి చెందిన నొల్లి గోవిందమ్మ (భర్త: నొల్లి ప్రసాద్) గత 25 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, ఇప్పటివరకు సొంత ఇల్లు లభించలేదని తెలిపారు. తన భర్త 89% అంగవైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గృహం మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు. 5. కొత్తగూడెం విద్యానగర్ కాలనీ 5వ వార్డుకు చెందిన లంక లీలా వితంతు పెన్షన్ కోసం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వెరిఫికేషన్ పూర్తయ్యినా ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొంటూ త్వరగా వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరిన దరఖాస్తును కలెక్టర్ తగు చర్యల నిమిత్తం డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :