Thursday, 17 September 2026 11:58:51 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన

Date : 09 September 2025 03:27 PM Views : 436

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా కవి కాళోజి సేవలు చిరస్మరణీయం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు.ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ తో కలసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, భాషలకు చిరస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టారని తెలిపారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడు, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వివరించారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ సాధారణ ప్రజల హృదయాలను తాకిన రచనలు ఆయనవి కావడంతోనే “ప్రజాకవి” అనే బిరుదును అందుకున్నారని చెప్పారు. కాళోజీ రచనలు ప్రజలకు ధైర్యాన్ని, సామాజిక అవగాహనను కలిగించాయని, ఆయన చూపిన మార్గం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాలు, సమస్యలను తన కవిత్వంలో ప్రతిబింబించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్‌ బిరుదుతో సత్కరించడం గర్వకారణమని తెలిపారు. కాళోజీ జయంతి ని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆయనకు ఇవ్వబడిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జయంతి వేడుకలు తెలంగాణ భాష, సాంప్రదాయం, సంస్కృతిని కాపాడుకునే దిశగా సమాజానికి స్ఫూర్తి కలిగిస్తాయని వివరించారు. భాషా వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కాళోజీ చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, ఓ ఎస్ డి వెంకటరమణ,ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :