Wednesday, 16 September 2026 05:53:01 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కార్మికుల 31 డిమాండ్లపై హైదరాబాద్‌లో సుదీర్ఘ చర్చలు, సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె అనివార్యమని ఎఐటీయూసీ హెచ్చరిక

Date : 25 June 2026 05:35 PM Views : 109

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో కీలక చర్చలు జూలై 10కి వాయిదా పడిన తదుపరి చర్చలు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారమే లక్ష్యమని గుర్తింపు సంఘం స్పష్టం. సింగరేణి కార్మికులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు,పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ ఈ నెల 8న యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన విషయం తెలిసిందే,కార్మికుల న్యాయమైన 31 డిమాండ్లపై స్పందించిన ఆర్ ఎల్ సి,హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ డాక్టర్ శాశ్వతి రథ్ సమక్షంలో గురువారం సుదీర్ఘ చర్చలకు హాజరయ్యారు,ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ చర్చల్లో కార్మికుల సమస్యలు, యాజమాన్య వైఖరి, పెండింగ్ అంశాలు,అమలు కాని ఒప్పందాలు,ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్మికుల తరఫున ఎఐటీయూసీ నాయకులు సమస్యల తీవ్రతను, వాటి ప్రభావాన్ని వివరంగా వివరించగా, యాజమాన్యం తన అభిప్రాయాలను వెల్లడించింది,ఇరుపక్షాల వాదనలు విన్న డిప్యూటీ లేబర్ కమిషనర్, సమస్యలపై మరింత చర్చ అవసరమని భావించి తదుపరి సమావేశాన్ని జూలై 10వ తేదీకి వాయిదా వేశారు,అయితే కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని ఎఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు, కార్మికుల హక్కులు,సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధమవుతామని వారు స్పష్టం చేశారు.ఈ చర్చల్లో ఎఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున ఏజీఎం (పర్సనల్) అజయ్ కుమార్ చర్చల్లో హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :