Monday, 03 August 2026 07:28:11 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తుతో నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 14 July 2026 05:33 PM Views : 86

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గంజాయి హాట్‌స్పాట్స్‌పై ప్రత్యేక నిఘా – ప్రాపర్టీ కేసుల డిటెక్షన్ పెంచాలి నెలవారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం నాడు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ ఆధారాలతో పటిష్ఠమైన దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం సహించబోమని హెచ్చరిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్ వంటి సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గంజాయి హాట్‌స్పాట్స్‌ను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ప్రాధాన్యతగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో త్వరితగతిన ఛేదించి దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించాలని సూచించారు. వాహన తనిఖీలు, రాత్రి పెట్రోలింగ్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ రోడీషీటర్లు, హిస్టరీషీటర్లు, బెయిల్‌పై ఉన్న నేరస్థులు, జైలు నుంచి విడుదలైన వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, డయల్-100కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :