తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సీతంపేట బంజర గ్రామానికి చెందిన భూక్య మదన్ సింగ్ (54), తండ్రి అమ్రు, వయసు 54 సంవత్సరాలు, అనే వ్యక్తి, నిన్న (శుక్రవారం) సాయంత్రం రుద్రంపూర్ గ్రామంలోని తన పనులను ముగించుకుని, రుద్రంపూర్ లోని తన చెల్లి గుగులోత్ షీలా వాళ్ళ ఇంటికి వెళ్లి తన మోటార్ సైకిల్ (AP 24 AG 3910) పై తిరిగి ఇంటికి బయలుదేరారు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో నిమ్మలగూడెం కాలనీ దాటిన తర్వాత, కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్ వద్ద BT రోడ్డుపై ఉన్న ఒక గుంటను గమనించకపోవడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మదన్ సింగ్ నిన్న రాత్రి 10:09 గంటల సమయంలో మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి కొడుకు భూక్య శ్రీనాథ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ