Friday, 18 September 2026 02:22:21 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 May 2026 06:07 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 వ తేదీ నుండి ఈ రోజు వరకు యువజనోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 04-05-2026న ఖమ్మంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన 105 మంది యువతీ యువకులకు జిల్లా కలెక్టర్ ప్రొవిజినల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. యువత అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని అన్నారు . అనంతరం సీఎం కప్ – 2026తో పాటు ఇతర క్రీడా పోటీలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, సమ్మర్ క్యాంపుల్లో విశేష ప్రతిభ ప్రదర్శించిన యువతకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా యువత ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం రూపొందించిన “తెలంగాణ టూరిజం బ్రాండ్ కిట్ – తెలంగాణ జరూర్ ఆనా”ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక, పర్యాటక విశేషాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ బ్రాండ్ కిట్ ఉపయోగపడుతుందని తెలిపారు . జిల్లా యువతకు టూరిజం శాఖ అందిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ” మరియు “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సుల గురించి కలెక్టర్ వివరించారు. టూరిజం రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చని సూచించారు. కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కో-ఆర్డినేటర్ డా. పి. నాగరాజు (డీడీ, మ్యూజియమ్స్)ను ఫోన్ నెంబర్లు 9849905722, 9849905723 ద్వారా లేదా archaeologydht@gmail.com ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యం. పరంధామ రెడ్డి, GM DIC మధుసూదన్ రెడ్డి, PIO పృథ్వి, ప్రశాంతి నగర్ సర్పంచ్ లైలా, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ వనజ క్రీడ కోచ్ లు: అబ్దుల్ నబి, కాసి హుస్సేన్, నాగేశ్వర్ రావు, లగడపాటి రమేష్, Y. V. శ్రీనివాస్, డానియల్ రాంబాబు, నవీన్, గిరి ప్రసాద్, నాగేంద్ర, జగన్నాధ్, పాపరాజు, శ్రీనివాస్, నాగ శివాజీ, మల్లికార్జున్, ప్రమీల, రవి కిరణ్, అఖిల్, కార్యాలయ సిబ్బంది తిరుమలరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :