Thursday, 17 September 2026 07:09:12 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

సంగం వెంకట పుల్లయ్య , తన వృత్తి ద్వారా సమాజానికి రోడ్డు భద్రత – ప్రమాదాలు నివారణ కోసం వినూత్న పద్ధతుల్లో ప్రజల్లో విశిష్టమైన సేవలు అందించారు.

Date : 15 August 2025 07:14 PM Views : 1057

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్‌గా, అలాగే అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు TGOs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తున్న సంగం వెంకట పుల్లయ్య , తన వృత్తి ద్వారా సమాజానికి రోడ్డు భద్రత – ప్రమాదాలు నివారణ కోసం వినూత్న పద్ధతుల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కల్పించడంలో విశిష్టమైన సేవలు అందించారు. రోడ్డు భద్రత అవగాహనతో పాటు ఆయా సందర్భాలు పురస్కరించుకొని హెల్మెట్స్ పంపిణి చేయడం, ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెండ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలలో, అలాగే లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సందర్భాలలో కనీసం ఒక మొక్కను నాటి ప్రేమతో పెంచాలని పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహిస్తున్నారు. రక్తదానం ద్వారా అవసరార్థుల ప్రాణాలను కాపాడాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేర్చేలా చర్యలు తీసుకుని గుడ్ సమారిటన్ గా నిలవాలని పౌర బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించి, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "ఉత్తమ రవాణా శాఖ అధికారి" గా ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ అవార్డును గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రోహిత్ రాజు IPS, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, “నాకు ఈ అవార్డు రావడానికి తోడ్పాటు అందించిన జిల్లా రవాణాశాఖాధికారి వి.వెంకట రమణ కి, ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ కి, అలాగే నాతో పాటు విధుల నిర్వహణలో భాగస్వామ్యమైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రోత్సాహం అందించిన మరియు అందిస్తున్న రవాణా శాఖ ఉన్నతాధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డు నా వృత్తిపట్ల మరింత బాధ్యతను పెంచింది. ఇకపై ఇంకా ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తాను అని తెలియజేసారు అలాగే వారితో పాటు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా టీజీవో కార్యవర్గ సభ్యులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మరియు రవాణా శాఖలోని ఉద్యోగులందరికీ TGOs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు” తెలియజేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :