Thursday, 17 September 2026 12:43:11 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 June 2026 05:33 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జగన్నాధపురం రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. మంగళవారం పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మేళాలో ఏర్పాటు చేసిన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి, విత్తనాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వాటి ప్రామాణికతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన, నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాల్లో సన్న రకాల వరి విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని 43 రైతు వేదికల ద్వారా విత్తన మేళాలు నిర్వహిస్తున్నామని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. యూరియా బుకింగ్‌ను కూడా యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని, రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా బుకింగ్ యాప్, విత్తనమేలపై రైతులలో అవగాహన కలిగించాలని వ్యవసాయ శాఖ అధికారులని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, వ్యవసాయ అవసరాలన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విత్తన మేళా ద్వారా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు, యూరియా బుకింగ్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు కలెక్టర్ చేతులమీదుగా విత్తనాలు, యూరియా అందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సోసిటీ ఛైర్మెన్ కొత్వాల శ్రీనివాస్, తాసిల్దార్ ధారా ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :