తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కుంటుపడిన గూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సిపిఐనే.క్రమబద్దీకరణ జీవో 76ను బుట్టదాఖలు చేస్తే ఊరుకొం.ఇండ్లు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ సాధించేవరకు విశ్రమించం. అర్హులైన ప్రతి పేదకూ ఇండ్లు, సంక్షేమ పథకాలు అందించాలి. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిసంచాలి.పాలకుల ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తాం..నిలదీస్తాం.కేంద్రం తీరు మార్చుకొని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా. కొత్తగూడెం పట్టణంలో ఆటా..పాటలతో సాగిన ప్రజాచైతన్య యాత్ర.కుంటుపడిన కొత్తగూడెం ప్రాంత అభివృద్ధిని గాడిలో పెట్టింది ఒక్క సిపిఐ మాత్రమేనని, నియోజకవర్గ అభివృధ్ధికోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని చేస్తున్న కృషికి ప్రభుత్వం సహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఐదో రోజైన సోమవారం కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి కార్మికప్రాంతాల్లో కొనసాగింది. ఆటా-పాటలతో అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ యాత్రలో భాగంగా రైల్వే స్టేషన్ సెంటర్, ఎంజి రోడ్డు, సూర్య పాలస్ రోడ్, సింగరేణి హెడ్డాఫీస్, ఎసిబి నగర్, రామవరం, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, రుద్రంపూర్, గౌతంపూర్, పెనగడప సెంటర్లలో జరిగిన సభల్లో యాత్ర రథసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ప్రసంగించారు. ప్రభుత్వం జారీ చేసిన క్రమబద్దీకరణ జీవో 76ను బుట్టదాఖలు చేస్తే ఊరుకునేది లేదని, పట్టాల జారీ ప్రక్రియ ఏమైందో పాలకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. దశాబ్దాలుగా నివాసముంటున్న రామవరం, సింగరేణి ప్రాంత ప్రజలకు తక్షణమే పొజేషన్ సర్టిఫికెట్లు జారీ యాజమాన్యపు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదకూ ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు తక్షణమే మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో సాగుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో సింగరేణి ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మాజీ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, సంస్థపై పరోక్షంగా అడ్డరపడిన కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లను యాజమాన్యం కూల్చివేసి నిర్వాసితులను చేసే కుట్రలు చేస్తోందని, ఈ విధానం మార్పుచుకోవాలని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు, యువజన, విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, జెన్జి ఉద్యమం ద్వారానైనా కేంద్రం వుద్ది తెచ్చుకోవాలని, తీరు మార్చుకోని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ, సామాన్యులపై భారాలు మోపుతున్న పాలకుల ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని, రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చైతన్య యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, ఉప్పుశెట్టి రాహుల్, కందుల భాస్కర్, జి వీరస్వామి, వాసిరెడ్డి మురళి, ఎస్ కే ఫహీం, ప్రజాసంఘాల నాయకులు భూక్యా శ్రీనివాస్, వరక అజిత్, ప్రజాప్రతినిధులు బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, దుర్గయ్య, సుధాకర్, మునిగడప పద్మ, శంకర్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి, యూసుఫ్, గట్టయ్య, ఖయూమ్, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ