తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులై 7 జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను వ్యతిరేకించాలని కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. ఈనెల 9 న నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం జూలూరుపాడు లో ఆటో కార్మికుల తో కలసి TUCI రాష్ట్ర కమిటీ ముద్రించిన సమ్మె గోడ పత్రికల ను ఆవిష్కరించారు. అనంతరం TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాల తో పాటు, రాష్ట్ర కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, ఫెడరేషన్లు జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని,వేంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసారు.ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి, కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నది ఆరోపించారు. దానిలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు, చట్టాలు సాధిస్తే, నేడు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాయడానికి పూనుకున్నది దుయ్యబట్టారు. బడాపారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల తదితర ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టాలనిగోపాలరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో TUCI అనుబంధ అటో వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాయల సిధ్దు,కార్మికులు కత్తి సాయి, పత్తిపాటి యొహాన్, సర్వయ్య, బాణోత్ రాజు,నేలాల అశోక్, సురేష్, సత్తి, శాంత, వెంకటమ్మ,ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ