తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 17 తెలుగు వెలుగు)గ్రామపంచాయతీ లకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ ) రాష్ట్ర కమిటీ పిలుపు లో బాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల MPDO మరియు MPO పంచాయతీ కార్మికుల సమస్యల పై మెమొరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్. . (TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు, జిల్లా కోశాధికారి బాణోత్ ధన్వంతరరావు,మండల నాయకులు,కార్మికులు తంబర్ల లచ్మీ,వినోద్, రాంబాబు,, నాగు, నరేష్,వెంకటేశ్వర్లు,హనుమంతరావు,నర్సహింమరావు,శేవ్యా,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ