Saturday, 19 September 2026 04:20:22 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ

Date : 14 April 2026 05:56 PM Views : 218

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : Arrive alive-2026 లో భాగంగా రెండవ రోజు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Arrive-alive-2026 రెండవ రోజున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ ప్రజలు,ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతా ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్,ఎస్పీ రోహిత్ రాజు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితోపాటు అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్,అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన,కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత,మేయర్ మూడ్ గణేష్,ఆర్డిఓ మధు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు,పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను సులభంగా నియంత్రించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ భార్యా,పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నుండి బయటకు రాగానే హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు.విధులలో రోడ్లపై పోలీసులు ఉన్నా లేకపోయినా భాద్యతగా రూల్స్ పాటించి భాద్యత గల పౌరులుగా మెలగాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :