తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వాపురం : అశ్వాపురం మండలం సీతారాంపురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ఆటోను రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ