తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. భూమి, భుక్తి విముక్తి పోరాటం చరిత్రాత్మకం.అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని 3 టౌన్ పరిధి బూడిదగడ్డ సిపిఐ కార్యాలయంలో వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా, అనంతరం నాయకులు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, జి వీరాస్వామి మాట్లాడుతూ నిరంకుశ నిజాం, భూస్వామ్య దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. వేలాది మంది కమ్యూనిస్టు యోధులు ప్రాణాలర్పించి పేదలకు భూమి, భుక్తిని అందించారని గుర్తుచేశారు. నేటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రజెండా అండతో సమరశీల పోరాటాలు నిర్మించడమే అమరులకు నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు భూక్య శ్రీనివాస్, గొనె మని, నేరెళ్ల రమేష్, విజయలక్ష్మి, నాయకులు మాచర్ల శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బోయిన విజయ్ కుమార్, బండి దుర్గ, తుమ్మ నర్సయ్య, శాపావట్ రవి, అజీజ్, గడ్డం సతీష్, ప్రభాకర్, ధనరాజ్, సాంబి రెడ్డి, నరేష్, పసునూటి రమేష్, నట్టే వీరయ్య, రాజేశ్వరరావు, శివ, సుజాత, రూపేష్, రంజిత్, ఓదెలు, సిందేం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ