Friday, 18 September 2026 07:13:52 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం – 2025

Date : 16 December 2025 09:01 PM Views : 264

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, నోడల్ అధికారులతో కలిసి *“కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం – 2025”*పై సమీక్ష సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శరీరంపై రాగి వర్ణంలో లేదా చర్మ రంగుకంటే తక్కువ రంగులో మచ్చలు కనిపించి, ఆ మచ్చలపై స్పర్శ (సెన్సేషన్) లేకపోతే కుష్టు వ్యాధిగా అనుమానించాల్సిందిగా సూచించారు. అటువంటి వ్యక్తులను వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి వైద్యాధికారులచే పరీక్షలు నిర్వహించి గుర్తించాలని తెలిపారు.ఈ మచ్చలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి భారంగా మారే ప్రమాదం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. జిల్లా ప్రజలందరూ 14 రోజుల కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గుర్తింపు ఉద్యమం ఈ నెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి వ్యక్తిని పరిశీలించడం జరుగుతుందని, ఈ సర్వేను విజయవంతంగా పూర్తిచేయాలని ఆశ కార్యకర్తలను కోరారు.ప్రస్తుతం జిల్లాలో 45 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 582 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి చికిత్స అందించగా, అందులో 532 మంది పూర్తిగా చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా మారారని వివరించారు.ఈ గుర్తింపు ఉద్యమంలో మొత్తం 2,29,336 ఇండ్లను, 1,407 మంది ఆశ కార్యకర్తలు పాల్గొని సందర్శించనున్నారు. గత మార్చి నెలలో నిర్వహించిన కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో 2,29,336 గృహాలను సందర్శించి 1,702 అనుమానిత కేసులను గుర్తించగా, అందులో 25 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరిగింది.గత సంవత్సరాల వారీగా గుర్తించిన కేసుల వివరాలు:2019లో – 62 కేసులు,2022–23లో – 38 కేసులు,2023–24లో – 36 కేసులు, 2024లో – 25 కేసులు ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధిగా సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది అందరూ అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్‌లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీల ప్రసవ క్యాలెండర్లను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రమాదకర గర్భిణీ స్త్రీలను ముందస్తుగా గుర్తించి అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ,ఏవో ప్రసాద్, NLEP ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుల్లారెడ్డి, బద్రు పీటీ, మోహన్ డీపీఎం, డీపీఓ సరిత, జిల్లా వైద్యాధికారులు, నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :