Friday, 18 September 2026 07:43:47 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 18 September 2026 05:42 PM Views : 26

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెదురు ఆధారిత ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలను పెంపొందించాలి.ఐడిఓసీలో ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు.ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా పాల్గొని వెదురు పెంపకం, పర్యావరణ పరిరక్షణ, వెదురు ఆధారిత ఉత్పత్తుల ప్రాధాన్యతపై మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు వేగంగా పెరిగే సహజ వనరు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే మొక్క అని తెలిపారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నేలకోతను నియంత్రించవచ్చని అన్నారు . ప్రకృతి వనరులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వెదురు వంటి ఉపయోగకరమైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వెదురును ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్, కాగితం, హస్తకళలు, అలంకరణ వస్తువులు తదితర అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వెదురు ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కళాకారులు, చేతివృత్తిదారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికత, డిజైన్‌లను జోడించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.వెనుకబడిన తరగతులకు చెందిన కళాకారులు, చేతివృత్తిదారులను వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీ వైపు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వెదురు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా వెదురు ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని విజయలక్ష్మి ,మేదరి కుల సంఘ నాయకులు కొంటు శ్రీనివాస్, స్వరూప,సిందూజ,కళావతి, రమాదేవి, పిల్లి శీను, సోమయ్య, బొల్లం శ్రీనివాస్, ప్రవల్లిక, కళాకారులు, చేతివృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :