తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని సీతారాంపురం ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద స్కూల్ పిల్లల ఆటోని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ