Thursday, 17 September 2026 09:09:37 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 04 February 2026 08:00 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.ఇందులో భాగంగానే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 08 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,04 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్,ఇల్లందు,అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 101 పోలింగ్ స్థానాలలోని 288 పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులో సాధారణ పోలింగ్ కేంద్రాలు 148, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 125 మరియు 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.మున్సిపాలిటీల వారీగా సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహారిస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎన్నికల పోటీలో నిలుచున్న అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల వద్ద నుండి అనుమతులు పొందిన తర్వాతనే తమ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.అనుమతులు లేనియెడల ఎన్నికల నియమావళి ప్రకారం అట్టి అభ్యర్థులపై కేసుల నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఓటర్లను ప్రలోభపరిచే విధంగా ఎవరైనా నగదు,మద్యం,ఇతరత్రా సామాగ్రిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ ఇంద్రాసేనారెడ్డి,పాల్వంచ సీఐ సతీష్,ఇల్లందు సీఐ సురేష్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు మరియు ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :