Thursday, 17 September 2026 05:25:41 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యం.శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తేనే రైతులకు అధిక దిగుబడి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 04 May 2026 08:06 PM Views : 201

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యం.శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తేనే రైతులకు అధిక దిగుబడి, ఆదాయం.అవసరానికి మించి రసాయనాలు వాడి భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు.మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి.యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి పెంచుకుని దేశానికి వెన్నుముకగా నిలవాలి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యమవుతుందని, ప్రతి రైతు తన భూమి స్వభావాన్ని తెలుసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా చుంచుపల్లి మండల పరిధిలోని ఎస్‌సీబీ నగర్ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన "రైతు మహోత్సవం - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాస్త్రవేత్తలతో చర్చించి భూమిలోని ఖనిజాల స్థితి, పీహెచ్ విలువలు, నేల స్వభావం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.​అనంతరం ఆయన రైతు ఉద్దేశించి మాట్లాడుతూ... మనిషికి రక్తపరీక్షలు ఎంత అవసరమో, భూమికి కూడా పరీక్షలు చేసి దాని ఆరోగ్యాన్ని కాపాడటం అంతే ముఖ్యమని వివరించారు. భూమికి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుంటేనే రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్నారు. సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, ముఖ్యంగా అవసరానికి మించి యూరియా, ఇతర రసాయనాల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉందో గమనించి అవే పంటలు సాగు చేయాలని, సాగునీటిని ఆదా చేస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రకృతిని కాపాడుతూ నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చని తెలిపారు. ఏడు రోజుల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని, రైతుల పిల్లలు కూడా ఈ వృత్తిపై మక్కువ పెంచుకుని ఆధునిక పద్ధతులతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. శాస్త్రం తోడైతేనే రైతు భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మేయర్ గణేష్ చౌహన్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :