Wednesday, 16 September 2026 09:53:19 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం – ప్రజల్లో అవగాహన కల్పించాలి

Date : 07 September 2026 12:32 PM Views : 121

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేత్రదానం ద్వారా మరొకరికి చూపును ప్రసాదించవచ్చు: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)ను డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబానికి సమతుల ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు మరియు ఇతర పోషక పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు మరియు వృద్ధులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నేత్రదానంపై విస్తృత అవగాహన అనంతరం *నేత్రదాన అవగాహన పక్షోత్సవం (ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు)*లో భాగంగా నిర్వహించిన రేడియో టాక్ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. తుకారం రాథోడ్ పాల్గొని ప్రజలకు నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా కార్నియా సమస్యల కారణంగా చూపును కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు చూపును అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం ఒక గొప్ప సామాజిక సేవ అని, ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా తన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చని వివరించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల నేత్రదానానికి ముందుగానే సమ్మతి మరియు అవగాహన కలిగి ఉండటం ముఖ్యమన్నారు. నేత్రదానం గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. “మరణానంతరం మన కళ్లను దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, నేత్రదానానికి ముందుకు రావాలి” అని డీఎంహెచ్‌ఓ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది మరియు సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :