తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భక్తి భావనలు సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందిస్తాయి. మద్దుకూరులో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య ఆశీస్సులు గ్రామ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి.మద్దుకూరు గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో స్థానిక MLA జారే ఆదినారాయణ మరియు సతీమణి వరలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, పవిత్రమైన మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారిని దర్శించుకుని, గ్రామ ప్రజలతో కలిసి ఆధ్యాత్మిక వేడుకలో పాలుపంచుకున్నారు, ఇటువంటి భక్తి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయని, స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ