తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ లకు రావాల్సిన సుమారు 50 కోట్ల నిధుల విషయంలో మొండిచేయి చూపుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఎస్పీ వరకు రెండున్నర ఏండ్ల నుండి టీఏలు,డీఏలు,సలెండర్ లివ్స్,పీఆర్సీ,ఏరియర్స్,జీఫిఎస్ తో పాటు కొత్త పీఆర్సీ రావాల్సి ఉందని ఒక్కొకరికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల పైగా సుమారు రూ.5 కోట్ల రూపాయల వరకు దాదాపు 1,600 మందికి పైగా పోలీసులకు రావాల్సి ఉందని,గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రభుత్వం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీసులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,తుంపూరి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ