తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు,నిరాశ్రయులు ప్రతి కుటుంబానికి 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని,ఆస్తి నష్టం అంచనా వేసి తగిన సహాయం అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలో చిక్కుకున్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని సౌకర్యాలు కల్పించాలని,వాతవరణ శాఖ మరో ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటన చేసినందున ప్రభుత్వం తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.బీఆర్ఎస్,కాంగ్రెస్ లు వరదలను రాజకీయం చేస్తున్నాయని,ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని,ఇది ప్రకృతి ప్రకోపం కాదని,పాలకుల తప్పిదమని,రియల్టర్ల ధన దాహం,అదికారుల అలసత్వమని గత బీఆర్ఎస్,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఫలితమే నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు,వందలాది కుటుంబాలు నిరాశ్రయులు,లక్షలాది ఎకరాల పంట నష్టం,వేలాది కోట్ల ఆస్తినష్టానికి కారణమన్నారు.వరదల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో *జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, సాయి, జంగం జెస్వంత్, గోపి చరణ్* తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ