తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ