తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆహ్లాదంతోనే మానసిక ప్రశాంతత.నిరంతర ఒత్తిళ్ల నుంచి కాస్త విరామం..ఆహ్లాదం.45 రోజుల పాటు ఎగ్జిబిషన్ ప్రదర్శన. ప్రజలు, చిన్నారులకోసమే వినోద వేదికల ఏర్పాటు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.లక్ష్మీదేవిపల్లిలో బాబా ట్రేడ్ ఫేర్స్ ఎగ్జిబిషన్'ను ప్రారంభించిన సాబీర్. రోజువారీ యాంత్రిక జీవనం, నిరంతర పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఆహ్లాదకరమైన వినోద వేదికలు ఎంతో అవసరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. దసరా, దీపావళి తదితర పండుగల సీజన్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో బాబా ట్రేడ్ ఫేర్స్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎగ్జిబిషన్'ను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపేందుకు, చిన్నారులకు చక్కని ఆటవిడుపును అందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రజలు ఒకే చోట వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు మంచి వినోదాన్ని పొందేందుకు ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు. మొత్తం 45 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను ప్రజలు, చిన్నారులు వినియోగించుకుని మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోర్స వీరబాబు, పడిగ రాంబాబు, కళ్యాణి, లక్ష్మినర్సు, కనకరాజు, ఎస్సై అఖిల, ఎగ్జిబిషన్ నిర్వాహకులు షఫి, రమణ, సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ