Monday, 02 November 2026 09:57:23 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది : జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు

Date : 21 October 2026 01:28 PM Views : 82

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు అమరవీరులకు జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్ -నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. పోలీసు అధికారి విధులకు వెళ్లినప్పుడు తిరిగి వస్తాడని ఎదురుచూసే తల్లి, క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఆశించే భార్య, నాన్న రాక కోసం ఎదురుచూసే పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబాల్లో తీరని విషాదం, చెరిగిపోని జ్ఞాపకాలు, జీవితాంతం వెంటాడే వేదన మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల ప్రేమానురాగాలను పక్కనపెట్టి, ప్రజల భద్రతను కర్తవ్యంగా భావించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి సేవలు ఒక్క రోజుకే పరిమితం కావని, దేశం ఉన్నంతకాలం వారి ధైర్యసాహసాలు, సేవా స్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ప్రతి వీర పోలీసు అమరవీరుడికి హృదయపూర్వక అశ్రునివాళులు అర్పిస్తున్నామని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలకు యావత్ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్నారని డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. వీర పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదా

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :