Friday, 18 September 2026 08:04:48 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 17 June 2026 05:01 PM Views : 173

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను సులభంగా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. యూరియాను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసార సాంద్రత తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో అధిక మొత్తంలో ఎరువులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు జరిగిందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. టేకులపల్లి మండలంలో ఐదు రైతు వేదికల ద్వారా యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18001237157 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.గత సీజన్‌లో రికార్డు స్థాయిలో మొక్కజొన్నను 2400 మద్దతు ధరకు కొనుగోలు చేసి, 1800 కు ప్రభుత్వం విక్రయించిందని నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారాలు చేపడుతున్నారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం కూడా అందులో భాగమేనన్నారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. అనంతరం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా అందజేశారు. టేకులపల్లి పర్యటనలో భాగంగా ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ధారావత్ చుక్కి, భర్త టిక్లీ నిర్మిస్తున్న ఇంటిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, నిధుల విడుదల తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహ ప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లక్కినేని సురేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ బోడ బాలు, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :