తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆక్యుపంచర్, అక్యూప్రెషర్ సైన్స్ ప్రాక్టీస్ లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న హీలర్. సుగుణా రావు మరో సర్టిఫికెట్ అందుకోవడంతో, ఆయనను పలువురు అభినందించారు. సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లి మహర్షి యోగ సెంటర్లో, ఆదివారం ప్రముఖ ఆక్యుపంచరిస్ట్, ట్రైనర్, డా.రవీందర్ రాజు ఆధ్వర్యంలోని స్పర్శ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రస్సర్ & యోగ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ, వెస్సెల్స్' (ఇ.ఒ.వి) కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్న, కొత్తగూడానికి చెందిన ప్రముఖ హీలర్ జి.సుగుణారావును పలువురి అభినందనలు అందుకున్నారు. అభినందించిన వారిలో ప్రముఖ ప్రకృతి కవి, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమ వ్యవస్థాపకులు జయరాజు, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, స్టెప్ తెలంగాణ మేనేజర్ డా. బత్తుల కృష్ణయ్య, మన్ కి బాత్ మొక్కలరాజశేఖర్, నవభూమి పత్రిక స్టేట్ బ్యూరో తుమ్మలపల్లి ప్రసాద్, సింగరేణి రిటైర్డ్ జిఎం శనగ వెంకటేశ్వర్లు, ఎ .జి. ఎం గోనె శ్రీకాంత్, ఖైరో ప్రాక్టర్ కమలరాణి , కృతి ఆశ్రమం సభ్యులు కేహెచ్ ప్రసాద్, డాక్టర్ వెంకట్, సాగర్, శంకర్, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు మొహమ్మద్ ముస్తఫా, అంబేద్కరిస్ట్ తుంపురు శివ లు ఉన్నారు. ఈ కోర్సు ద్వారా ఒరిజినల్ ఛీ, రెంటల్ ఎనర్జీ, కిడ్నీ ఎనర్జీ, మింగ్ మెన్, ఇన్ వెజిల్స్, యాంగ్ వెజిల్స్, లోయర్ బ్యాక్ పెయిన్, నీ డయగ్నోసిస్, ఫింగర్ డయాగ్నోసిస్, టోనిఫికేషన్స్, సెడేషన్స్ ల పై ట్రీట్మెంట్స్ పద్ధతులను నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన అందరికీ సుగుణ రావు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ