Tuesday, 03 November 2026 07:36:26 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి.

Date : 21 August 2026 05:18 PM Views : 325

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలంలో నిర్మిస్తున్న కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న వివిధ బ్లాకులను కలెక్టర్ పరిశీలించారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, తరగతి గదులు, ల్యాబొరేటరీ బ్లాక్ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆయా పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాల మేరకు నాణ్యతతో చేపట్టడంతో పాటు, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ప్రస్తుతం వైద్య కళాశాల ప్రధాన భవనాలు, హాస్టల్ భవనాలు,ఆసుపత్రి,తరగతి గదులు, ల్యాబొరేటరీ బ్లాక్ తదితర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించిన కలెక్టర్, కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న అంతర్గత రహదారులు, లైబ్రరీ, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, విద్యార్థుల వసతి తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రతి సంవత్సరం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాలలో బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, వసతి, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయా, ఇంకా ఏవైనా అదనపు వసతులు అవసరమా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని అన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రతి పనికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.మిగిలిన నిర్మాణ పనులను కూడా డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో సంబంధిత వైద్య, ఇంజినీరింగ్, నిర్మాణ శాఖల అధికారులు, నర్సింగ్ కళాశాల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :