Monday, 02 November 2026 06:15:26 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి.

Date : 15 October 2026 09:03 PM Views : 124

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళా హక్కుల రక్షణకు ఉద్యమిద్దాం.మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. వేధింపులు లేని సమాజం కోసం పోరాడుదాం. తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి.మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.సమాజంలో మహిళా హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి రాజీలేని ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి పిలుపునిచ్చారు. తెలంగాణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సమాఖ్య నాయకులు, కార్యకర్తలు సాంప్రదాయ రీతిలో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్నా లక్ష్మీకుమారి మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలోనూ మహిళలపై హింస, వివక్ష, దాడులు కొనసాగడం శోచనీయమన్నారు. మహిళా సంక్షేమానికి సంబంధించి కాగితాలకే పరిమితమైన చట్టాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు రావాల్సిన 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంలో పాలకులు తాత్సారం చేయడం తగదన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక ఇబ్బందులపై సమష్టిగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా నాయకురాళ్లు పద్మజ, ధనలక్ష్మి, మునిగడప పద్మ, మేదిని లక్ష్మీ, పైడిపల్లి లక్ష్మి, కైసర్, షాహిన్, వెంకటలక్ష్మి, ధార లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :