తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం యువకులు ప్రతిభ చాటారు. శనివారం హైదరాబాదులోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం యువకులు ఐదు పతకాలు సాధించారు. నవభారత్ పబ్లిక్ స్కూల్లో విద్యానభ్యసిస్తున్న కొట్టే సాయి శ్రీ వాత్సావ్ మూడు కాంస్య పథకాలు, బండారి నాగ చైతన్య రెండు కాంస్య పతకాలు సాధించారు. సాయి శ్రీ వాత్సవ్ 50 మీటర్స్ ఫ్రీ స్టయిల్ , 50 మీటర్ బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ బ్రెస్ట్ స్ట్రోక్ లో పతకాలు సాధించగా, నాగచైతన్య 400 మీటర్స్ ఐ. ఎం , 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో పతకాలు సాధించారు.నవభారత్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.వి రెడ్డి, స్విమ్మింగ్ కోచ్ లు హనుమంతరాజు, సామ్యూల్, సంధ్య సామంత్ లు విద్యార్థులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ