Wednesday, 16 September 2026 06:59:15 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గిరిజన గర్జనతో హోరెత్తిన పాల్వంచ

Date : 18 July 2026 06:10 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఆదివాసీ హక్కులకై కదంతొక్కిన 'గిరి'జనం గిరిజనుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ మహాసభల్లో పాల్గొన్న సీపీఐ అగ్రనేతలు ప్రారంభమైన టీజీఎస్ రాష్ట్ర మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) రాష్ట్ర మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల ప్రారంభ సూచికగా స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నుండి పాత ఆర్డీవో కార్యాలయం రోడ్డులోని అమరజీవి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనతో పాల్వంచ పురవీధులన్నీ గిరిజన జయధ్వానాలతో హోరెత్తాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా, భద్రాద్రి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు, సీపీఐ, టీజీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గిరిజన హక్కుల సాధనకై నేతలు గళమెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇంచార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై దిశానిర్దేశం చేశారు. వారితో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తి నాయక్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్రావు, టీజీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూక్య శ్రీనివాస్, సొందే కుటుంబరావు తదితర అగ్రనేతలు ఈ ప్రదర్శనను ముందుండి నడిపించారు. గిరిజనుల ఐక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ మహాసభల తొలిరోజు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :