తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లేపల్లి నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న కారును పండితాపురం సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కవిత, చిట్టిబాబు, విజయ, సత్యవతి, సుశీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ